మునుగోడును రెవిన్యూ డివిజన్ గా చేయాలని 2వ రోజు రీలే నిరాహార దీక్ష

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: మునుగోడును రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతోపాటు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మాధగోని వెంకటేశ్వర్లు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. రెండో రోజుకు చేరిన దీక్షకు అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పేరుకే నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు అన్ని రకాలుగా అభివృద్ధిలో వెనుకబడిందని ఇప్పటికైనా మునుగోడును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు, మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మునుగోడును ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతున్న నల్గొండ లోనే ఉంచడంతోపాటు మునుగోడును మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Scroll to Top