నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 23: ప్రభుత్వం విడుదల చేసిన ఎ.ఎన్.యం.ల నోటిఫికేషన్ రద్దు చేసి ఎటువంటి పరీక్షలు లేకుండా రెండవ ఎ.ఎన్.యం. లను వెంటనే రెగ్యులర్ చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ వద్ద బుధవారం ఎ.ఎన్.యం ల ధర్నాకు ఆమే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ వారి ఆశలు నెరవేరలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి దాదాపు 20 సంవత్సరముల సుదీర్ఘకాలము నుండి ఎంపిహెచ్ ఎ (ఈ)లకు సమానంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నరు అని అన్నారు. ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకున్నా ఏదో ఒక రోజు రెగ్యులర్ చేస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు అని అన్నారు.కోవిడ్-19 మహమ్మారి సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యాధిగ్రస్తులకు దగ్గర ఉన్న సమయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఎ.ఎన్.యం.లను ఎటువంటి పరీక్షలు లేకుండా వెంటనే రెగ్యులర్చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,రెండవ ఎ.ఎన్.యం.లు సామ సునీత, యాతకుల మాధవి, రూప, శ్రీలత, అరుణ, విజయ్ జయలక్ష్మి, వసంత, మాదవి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.