భక్తి మార్గమే సుఖ శాంతి సిరిసంపదలనిస్తుంది

మహా కాల సర్ప శాంతి పూజను విజయవంతం చేయాలి: రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: భక్తి మార్గం తోనే ప్రజలందరికీ సుఖ సంతోషాలతో పాటు సిరిసంపదలు లభిస్తాయని రైతు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదులోని శ్రీ రేణుక రాజరాజేశ్వరి పీఠం వ్యవస్థాపకులు మోల్లూరు నవీన్ శర్మ ఆధ్వర్యంలో ఈనెల 29నా నిర్వహించే మహా కాల సర్ప శాంతి పూజ ఆహ్వాన పత్రికను పీఠం వ్యవస్థాపకులు నెల్లూరి నవీన్ శర్మ తో కలిసి ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 మంది జంటలతో మన్నెగూడ లోని బి.ఎం.ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే ఈ మహా కాల సర్ప శాంతి పూజను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రజలందరూ దైవ మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా జీవనాన్ని సాగిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రజలకు ఎటువంటి దోషాలు తగలకుండా ఈ శాంతి పూజను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ శాంతి పూజ నిర్వహించలేదని మొట్టమొదటిగా హైదరాబాదులో నిర్వహిస్తున్నందున ప్రజలు అధిక సంఖ్యలో శాంతి పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని రాజవర్ధనరెడ్డి, యాన్నం మధుసూదన్ రెడ్డి, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి ,పుల్లయ్య ,రవి ,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top