బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలుపించాలి: జడ్పిటిసి కర్నాటి వెంకటేశం

గట్టుప్పల్, ప్రజానేత్రం, మే 06: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పిటిసి కర్నాటి వెంకటేశం ఓటర్లను కోరారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతారని. కారు గుర్తుకు ఓటు వేసి భువనగిరి ఎంపీగా మునుగోడు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, చిలుకూరి అంజయ్య, పద్మశాలి యువజన సంఘం నాయకులు పున్న కిషోర్ కర్నాటి అబ్బయ్య జగన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top