దామెరలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని దామెర గ్రామములో మాడెల్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతినీ ఆదివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు వట్టిపల్లి నాగరాజు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దామెర యాదగిరి గమాట్లాడుతూ ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని అన్నారు. వారు నేర్పించిన స్ఫూర్తిదాయకమే నేడు తెలంగాణ ఏర్పాటుకు దోహద పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బచ్చనబోయిన పెద్దులు, సంఘం ప్రధాన కార్యదర్శి బూతరాజు నాగార్జున, వట్టిపల్లి బిక్ష్మయ్య, శంకరయ్య, లింగయ్య, జంగయ్య, నర్సింహా, రవి గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top