చౌటుప్పల్ జడ్పిటిసి బరిలో ఉప్పు కృష్ణ..!

చౌటుప్పల్, ప్రజానేత్రం, మార్చి 16: చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుండి చౌటుప్పల్ మండల జడ్పిటిసి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో కీలక భూమిక పోషించి అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్వహించి, సంఘ బలోపేతం కొరకు పార్టీ ప్రతిష్ట కొరకు ఎంతగానో కృషి చేశాడు. చౌటుప్పల్,భువనగిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించినాడు.

తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన బి(టి)ఆర్ఎస్ పార్టీలో 2007 లో చేరి తెలంగాణ ఉద్యమంలో పార్టీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలో ముందుండేవాడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఉద్యమ సమయంలో కేసులపాలై,లాఠీ దెబ్బలుతీసి, జైలు జీవితం అనుభవించాడు.తర్వాత క్రమంలో పార్టీయే అధికారంలోకి రావడంతో కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు ఎలాంటి పదవులు రాకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కెసిఆర్ ,కేటీఆర్ గార్లలపై విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులకు దీటైన సమాధానం చెబుతూనే సోషల్ మీడియాలో, ఇటు ప్రజలల్లో నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీకి విధేయుడుగా పని చేశాడు. ఇదే తరుణంలో ప్రభుత్వ పెద్దలు పార్టీకి విధేయుడుగా పని చేసిన తీరును గుర్తించి నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలని చూసింది. చివరి వరకు తనకే పదవి వరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వివిధ రాజకీయ సమీకరణల పేరుతో చివరి నిమిషంలో నామినేటెడ్ పదవి చేజారిపోయింది. పదవి రాకున్నా నిరుత్సాహ పడకుండా అదే పద్దతిలో పార్టీకి పనిచేస్తూ వస్తున్న క్రమంలో 2019 లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవకాశం కోసం ప్రయత్నం చేసిన ఆర్థికంగా బలంగా లేకపోవడంతో మరొకసారి అవకాశం చేజారిపోయింది.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మాత్రం ,ప్రభుత్వం ఏర్పాడిన నెల రోజుల్లోనే ఉప్పు కృష్టకు రాష్ట్ర స్ధాయి నామినేటెడ్ పదవి వచ్చేది మాత్రం వాస్తవం అనేది తన సన్నిహితులు, చేబుతున్నారు. దురదృష్టవశాత్తు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ ఉప్పుకు నిరాశ మిగిలింది. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయింది. ఓటమిక గల కారణాలను అన్ని విధాలుగా పరిశీలించి, ఉద్యమకారులకు, పార్టీకి నిరంతరం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని భావనలో అధిష్టానం చేసిన ఆలోచనలో‌ కీలకమైన కారణం ఇదే అనేది చర్చ జరుగుతున్న క్రమంలో, పార్టీ పెద్దలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో కార్యకర్తలు తమ బాధను పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లినారు అధిష్టానం కూడా వారీ భాధలో న్యాయం ఉందని భావన కొచ్చినట్టు సమాచారం. పార్టీ కొరకు పనిచేసిన వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామనే విశ్వాసాన్ని కార్యకర్తల్లో నింపడంతో నిబద్ధతతో పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్తల్లో కొంత ధైర్యం పెరిగింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరైన ఉప్పు కృష్ణ సైతం తమ అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం.

చూడాలి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కులగణన తర్వాత బీసీల రిజర్వేషన్లు కోట పెరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అనే ప్రచారం జరుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పు కృష్ణకు జెడ్పిటిసి అయ్యే అవకాశం కలిసొస్తుందా లేదా అనేది చూడాలి. అవకాశం కలిసోస్తే మాత్రం ఉప్పు కృష్ణ జడ్పిటిసి బరిలో నిలవడం మాత్రం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుంది. ఆ విధంగా తన కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టు ప్రాధమికంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతల ఆశీర్వాదాలు పుష్కలంగా ఉప్పు కృష్టకు ఉన్నాయని అవకాశం తప్పకుండా వస్తుందాని ఆయన సన్నితులు పార్టీ,శ్రేణులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి భారస చౌటుప్పల్ జడ్పిటిసి బరిలో నిలిచేది ఎవరో ? అవకాశం దక్కేది ఎవరికో ?

Scroll to Top