సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ 30వ గణేష్ ఉత్సవ వార్షికోత్సవాళ్ళ లో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చింతల గణేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా రాసాల మధు సాగర్, వీరమల్ల మణికంఠ గౌడ్,ఆవుల నరసింహ యాదవ్, మాధగోని లక్ష్మణ్ గౌడ్, మౌదాల విక్రమ్ గౌడ్ లను ఎన్నుకోవడం జరిగినది.ఈ ఎన్నిక కార్యక్రమంలో హనుమాన్ యూత్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పల్లె ఆనంద్, రాపర్తి ప్రదీప్ గౌడ్, దూసరి శ్రీశైలం, పల్లె సురేష్,దూసరి వెంకటేష్,వీరమల్ల వెంకటేష్,మారగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు.