రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించే కుట్ర: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు బిజెపి కుట్ర చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నెల్లికంటి సత్యం అన్నారు సాయుధ పోరాట వీరుల అమరత్వానికి ఊరురా వెలిసిన స్తూపాలే నిలువెత్తు సాక్ష్యాలు అన్నారు శనివారం నాంపల్లి మండలంలోని మేలవాయి గ్రామంలో దోమల సత్యం స్తూపం వద్ద నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సభలో ఆయన మాట్లాడారు తెలంగాణ సమాజ స్థితిని మార్చిన రైతాంగ పోరాటం చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు 4500 మంది అమరుల రక్తంతో తడిసిన నేల వ్యక్తి చాకిరి నుంచి మట్టి మనుషులను విముక్తి చేసిందన్నారు రజాకారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కు కోసం సాగిన పోరాటాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తుందన్నారు చరిత్రను వక్రీకరించే విధంగా కుట్రలు పన్నుతుందన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం భానుచన్ దోర కాలు మొక్కుతా అన్న ప్రజలను బంధూకూలు పట్టించి భూస్వాములకు వ్యతిరేకంగా దేశ్ముకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగించింది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల ఆనాడు భూస్వాములు జాగిందారులు గ్రామీణ ప్రాంతాల్లో నైజాం కు చోరబడే విధంగా ఆనాడు ప్రభుత్వానికి లొంగిపోయి తెలంగాణ రాష్ట్రానికి మన దేశానికి తెలంగాణలో మన భారతదేశానికి విలీనం కావడం జరిగింది అదే సెప్టెంబర్ 17. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుగుతావున్నాయి . ఈనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సజీవ సాక్ష్యం బిజెపి కేంద్ర ప్రభుత్వం ముసిముసి మామిడికాయలు చేసే విధంగా రేపు హైదరాబాదులో అమిత్ షా బహిరంగ సభ పెట్టబోతున్నారు ఈ సాయిధ పోరాటాన్ని గుర్తించకుండా హిందూ ముస్లింల పోరాటంగా చేస్తా ఉంది దురదృష్టకరం ఎందుకంటే రాష్ట్ర చరిత్రను రుద్వీకరణ చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూంమెహిద్దీన్ లాంటివాళ్ళు నైజాం రాచరికం పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. ఈ పోరాట స్ఫూర్తితోనే నల్లగొండ జిల్లా భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ధర్మబిక్షం లాంటివాళ్ళు ఈ ప్రాంతంలో గడ్డి లింగయ్య ఉజ్జిని నారాయణరావు లతో అనేక పోరాటాలు జరిగాయి ఈ మేలవాయి గ్రామం నుండి దోమల సత్యం ప్రజలకు ప్రభుత్వ భూమి బంచరాయి భూమి పోరాటం చేసి భూమి పంచిన ఘనత దోమల సత్యం అని అన్నారు కాబట్టి ఈ గ్రామం నడిబొట్టున అతని స్తూపం నిర్మించారు చిరకాలం కమ్యూనిస్టుగా నిలబడ్డ వ్యక్తి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కబంధ హస్తానికి తీసుకపోకుండా కమ్యూనిస్టులు ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని బిజెపిని ఓడిస్తే కేసీఆర్ అవకాశవాదంతోని కమ్యూనిస్టులకు దూరమైండు అయినా మొక్కవోని ధైర్యం తోటి నిలబడ్డాం. ఇటువంటి వాళ్లు చరిత్రలో అనేకమంది పారిపోయిన సందర్భంబం ఉంది కెసిఆర్ అన్న మాటలకు పొంతన లేదు దళిత బంద్ గాని డబల్ బెడ్ రూములు గాని అనేక సమస్యలు ప్రజలు ఆలోచన చేయాలి నీతి నిజాయితీగా నిలబడే ఎర్రజెండా పార్టీని బలపరచాలి దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు సభండ వర్గాలు ఆలోచన చేయాలి రాజకీయంగా ఓట్లకు పైసలు పెట్టి ఓట్లను కొనుగోలు చేసే వ్యక్తులకు బుద్ధి చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆర్ అంజయ్య చారి తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జనం పాట జగన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళి కృష్ణ, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ గిరి రమ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ఊరు పక్క వెంకటయ్య, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ సుదనబోయిన రమేష్ సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి నేతాల రాజు, కార్యవర్గ సభ్యులుదండిగా వెంకటయ్య, కుంభం సత్తి రెడ్డి, కోరేసత్తయ్య, అగ్గిరాజు బుషిపాక యాదయ్య పరిటాల రవి, బుషిపాక ప్రశాంత్, బుడిగపాక కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top