మాయ మాటలను నమ్మి సంక్షేమాన్ని మరువద్దు: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  • అనంతరం బతుకమ్మ చీరలు పంపిణి చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 05: కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల మాయమాటలను నమ్మి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మరువ వద్దు అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గట్లమల్లేపల్లి నుండి తుమ్మలపల్లి వరకు రూ.2.34 కోట్లు, కేతేపల్లి నుండి తిరుమలగిరి వరకు రూ.1.62 కోట్లు, మల్లెపల్లి రోడ్డు నుండి బండ తిమ్మాపురం వరకు రూ.1.35 కోట్లు, చల్లవానికుంట నుండి కలమంద బావి తండ వరకు రూ.1.40 కోట్లు , శంకిశాలలో పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సబ్బండ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ , బిజెపి పార్టీల నాయకుల మాయ మాటలను నమ్మి ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ ని మరువ వద్దు అని అన్నారు. రైతులకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం , ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్రం, ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న రాష్ట్రం, రైతు బీమా, రైతు బంధు పథకాల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top