గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే చిరుమర్తి, జడ్పీ చైర్మన్ బండ

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 16: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఔరవాణి గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సీసీ రోడ్డు పనులకు, రూ.5 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, రూ. 5 లక్షలతో కల్వర్ట్ పనులకు వారు శంకుస్థాన చేశారు. అనంతరం వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని మౌలిక సదుపాయాల్లో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, పల్లె ప్రగతి, వైకుంఠ ధామంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బిఆర్ఎస్ మండల అద్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొండూరి శంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ మాడగోని అం డాలు నర్సింహ, ఎంపిటిసి విజయ లక్ష్మి వెంకటేశ్వర్లు, నిరుడు వేణుగోపాల్ రెడ్డి, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top