ఆరు గ్యారంటీల పథకాల అమలు హర్షనీయం…

నల్గొండ/మునుగోడు, ప్రజానేత్రం, ఫిబ్రవరి 28: ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిని ఆర్ గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం హర్షనీయమని మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా స్వామి గౌడ్ అన్నారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ ల అభయా హస్తం పేదలకు నేస్తం లాంటిదన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం, చేయుత, రైతు భరోసా ఇలాంటి పథకాలతో గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా మహిళలకు మేలు జరుగుతుందన్నారు.

ఇటీవల మరో రెండు పథకాలను అమలు చేయడం ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాక్షేమానికి సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉంటారన్నారు. గత ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో పథకాల అమలు కొనసాగించడం సంతోషకరమన్నారు. త్వరలోనే రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీ కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to Top