జయప్రద లేఅవుట్ లో మార్చి వ్యాపార సముదాయాల స్థలం కబ్జా: చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషనర్ కు వినతి పత్రం

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 29: వ్యపార సముదాయాల కోసం వదిలిన స్థలంను కబ్జచేసి అమాకులకు కట్టబెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దుల శ్రీనివాస్ కురుమ అలియాస్ హమాలి శ్రీనన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుర్ర శివశంకర్ లు శుక్రవారం బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల ఒకటవ డివిజన్ జయప్రద కాలనీలోని సర్వేనెం.130 లో వ్యాపార సముదాయం నిమిత్తం విడిచిపెట్టిన 1200 గజాల స్థలంలో కాశీం షరీఫ్ అనే వ్యక్తి బోగస్ డాక్యుమెంట్లను సృష్టించి దొంగ జిపిఏ చేసుకుని 200,100,120 గజాలు చెప్పున పలువురికి అమ్మి వేయడం జరిగిందని తాజాగా మరో 100 గజాలను మురళి అనే వ్యక్తికి అమ్మగా సదరు వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టగా నిర్మాణం విషయంపై కాలనీవాసులు నిర్మాణదారుని ప్రశ్నించగా నా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటారా అంటూ మా పైనే కేసు పెట్టడం జరిగిందని అన్నారు.ఈ విషయంపై గతంలో మంత్రి మల్లారెడ్డికి ఫిర్యాదు చేశామని, మరొక మారు నేడు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.ఇలాగా దొంగ జిపిఏ లతో చెంగిచెర్లలో భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న వారి పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారిని పిలిచి అక్రమ అనుమతులతో చేపడుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

Scroll to Top