వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మార్వో కు వినతి పత్రం

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 16: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మధ్యాహ్నన భోజన కార్మికులు శనివారం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంట కార్మికులకు ఇచ్చిన 3 వేల రూపాయాలను ఇస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు ఇవ్వకుండా ఉన్నారన్నారు.అలాగే గుర్తింపు కార్డులను హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కట్టెలు దొరకకుండా ఇబ్బందులకు గురవుతున్నాము గ్యాస్ స్టవ్ ఇవ్వాలని కోరారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నీళ్ల పుష్పలత,ప్రధాన కార్యదర్శి చింతకింది చంద్రమ్మ,వలిగొండ సుగుణమ్మ,ఎర్రోళ్ల అమృతమ్మ,పిన్నింటి అరుణమ్మ,పాపగంటి స్వరూప,షాద సుల్తానా,పంది జంగమ్మ,కట్టెల పద్మ, మల్లమ్మ,ముత్తమ్మ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top