70 వేల ఆర్థిక సహాయం అందజేసిన పిల్లి రామారాజూ యాదవ్

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 26: నల్గొండ నియోజకవర్గంలో వివిధ కారణాలతో రీత్యా మృతి చెందిన కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకులు, ఆర్కేస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామారావు యాదవ్ భరోసానిస్తూ శనివారం రూ. 70 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కనగల్ మండలం నీలకంఠ రాములు, బొమ్మపాల రిత్విక్, మండలి కోటేష్, జంపరాతి అంజయ్య, నలగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన పల్లకీర్తి కొండయ్య, దొనకల్ గ్రామానికి చెందిన సల్లోజు సత్తయ్య, మేళ్లదుప్పలపల్లికి చెందిన నందిపాటి ప్రదీప్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10వేల చొప్పున 70 వేల వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు అండగా ఉంటామని ధీమానిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి ఎంపీటీసీ యెరెడ్ల సరస్వతి సుధాకర్ రెడ్డి, ఉప అధ్యక్షులు గోన శంకర్ రావు, కనగల్ ఉప సర్పంచ్ సింగం పెద్దులు, శ్రవణ్, మండలి పరమేష్, జయశంకర్ గౌడ్, శివ రెడ్డి, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top