బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి

చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 26: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు. బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Scroll to Top