మరింత మంచి చేయడానికి మరొక అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: జగనన్న ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమం – చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తున్న మార్పును ప్రతి ఒక్కరికి తెలియజేయాలి గత అవినీతి పాలనకు మన అభివృద్ధి పాలనకు గల వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం పరిటాల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, గృహ సారధులతో ఎమ్మెల్సీ, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మా పనితీరు నచ్చితేనే… మీ ఇంట్లో మేలు జరిగితేనే.. ఓటు వేయమని ఇంత ధైర్యంగా.. సగర్వంగా చెప్పే దమ్ము నందిగామ మాజీ ఎమ్మెల్యేకు, తెలుగుదేశం నేతలకు ఉందా… అని అడగాలని చెప్పారు. జగనన్న పాలనలోనే గ్రామాలు మారాయి… ఊరి రూపురేఖలే మారిపోతాన్నాయి… ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, గ్రూపు రేఖలు మారిన ప్రభుత్వ పాఠశాలలు కనిపిస్తాయన్నారు. మరి తెలుగుదేశం హయాంలో శిధిల వ్యవస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు, చిన్న అనారోగ్యమైన కిలోమీటర్ల దూరం వెళ్లి ఆసుపత్రికి.. చిన్న పని కావాలన్న కిలోమీటర్లు ప్రయాణం చేసి మండల కేంద్రాలకు వెళ్లే దుస్థితి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top