VT13 | వరుణ్‌ కొత్త సినిమా టైటిల్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ ఎప్పటికప్పుడు తన కథల ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా.. డిఫరెంట్ జానర్‌లలో సినిమాలు చేస్తూ జనాల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్‌ గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే విధంగా సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన నటించిన గాండీవధారి అర్జున రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గరుడ వేగ, కల్కి వంటి అద్భుత సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్‌ ఏయిర్‌ ఫోర్స్‌ బ్యాక్‌గ్రాప్‌లో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా చిత్రయూనిట్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్‌తోనే సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానూషీ చిల్లర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ ఏయిర్‌ ఫోర్స్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Scroll to Top