హైదరాబాద్, ప్రజానేత్రం, ఆగష్టు 14: భారత యువ సంచలనం తిలక్ వర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుతః అనిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన ఈ తెలుగు కుర్రాడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తిలక్ ఇప్పటికే ఏడు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, గతంలో రోహిత్ శర్మ సిక్స్‌లతో నెలకొల్పిన రికార్డు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో 32, రెండో టీ20లో 52 పరుగులతో రాణించాడు. తిలక్ వర్మ ఆట చూసిన మాజీ ఆటగాళ్లు అతడు వరల్డ్ కప్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నారు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన తిలక్ పరిస్థితులకు తగ్గట్టు ఆడడంలో దిట్ట. అందుకని అతడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో చక్కగా సరిపోతాడని విశ్లేషకులు అంటున్నారు.