రిజిస్ట్రేషన్ కొరకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో మృతి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 14: తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడు నరసింహకు రిజిస్ట్రేషన్ చేసేందుకు మునుగోడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ (80) తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడికి రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్టర్ దగ్గరికి వెళ్లి స్పృహ కూలిపోయి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.

Scroll to Top