యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయోధ్య

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: అఖిల భారత యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుండెబోయిన అయోధ్య యాదవ్, అధ్యక్షులుగా చుక్కల సత్యనారాయణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్ధుల బాబురావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్, చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండెబోయిన అయోధ్య యాదవ్ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శిలకు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యాదవుల అబ్బ్యున్నతకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల మల్లేష్ యాదవ్, రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్, నాయకులు ముక్కామల దుర్గయ్య, జంగా శ్రీనివాస్ యాదవ్, జంగా శ్రీను యాదవ్, మల్లికార్జున యాదవ్, గుండెబోయిన వెంకటేష్ యాదవ్, ఈడుదల ఐలయ్య యాదవ్, నల్ల గణేష్ యాదవ్, మెరుగు బాలకృష్ణ యాదవ్, డాక్టర్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top