చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లేనా…?

తిరుపతి, ప్రజానేత్రం, ఆగష్టు14: తిరుమల తిరుపతి నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోన్ లో చిక్కిన విషయం తెలిసిందే. టిటిడి ఫారెస్ట్ అధికారులు చిరుతను జూ పార్కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ బాలికపై దాడుచేసిన చిరుత ఇదేనా కాదా అన్నది పరిశీలిస్తున్నామని, చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాల్లు ఉన్నాయా లేదా అన్న తెలుసుకుంటామన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా ఫారెస్ట్ లో వదలాల అన్నది నిర్ణయిస్తామన్నారు. చిన్నారి చనిపోయిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని ఆ ప్రాంతంలో చిరుతల సంచారం ఉన్నట్టు అడవి శాఖ అధికారులు గుర్తించారని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 సంవత్సరాలలోపు చిన్నారులకు అనుమతులు లేవని, భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Scroll to Top