సిద్ధం సభను విజయవంతం చేయ్యాలి: శైలజ రెడ్డి

చిత్తూరు, ప్రజానేత్రం, ఏప్రిల్ 02: బుధవారం (రేపు) పూతలపట్టులో జరిగే సిద్ధం సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆంధ్ర విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ అధ్యక్షతన జరగనున్న సిద్ధం సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని అన్నారు. ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై జగనన్నకు మద్దతు తెలుపుతూ సిద్ధం సభను విజయవంతం చేయాలని కోరారు. మరోసారి జగనన్నను సీఎం చేయాలని ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు.

Scroll to Top