ఆడబిడ్డలను శక్తివంతులుగా చేసే బాధ్యత చంద్రన్నది: తంగిరాల సౌమ్య

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పని చేస్తున్నారు నందిగామ ఎన్డీయే కూటమి ఎమ్మేల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం 16వ వార్డు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు తీసుకువచ్చారన్నారు. మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం పరితపిస్తారని, రాష్ట్రంలో గత అయిదేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల బతుకు దుర్భరంగా మారిందని, యథారాజా తధానేత అన్న చందంగా మొండితోక వసూల్ బ్రదర్స్ పొట్టనిండా అబద్దాలే … నోటి నిండా అబద్దాలే అన్నారు. జనానికి ఇచ్చిన దానికంటే దోచేది ఎక్కువ, ఈ అసమర్థులు కొండలని మాయం చేశారని… ఖనిజ సంపదనీ దోచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top