సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలించిన మంత్రులు రోజా, పెద్దిరెడ్డి

నగరి, ప్రజానేత్రం, ఆగష్టు 20: నగరి నియోజకవర్గ కేంద్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఆదివారం పరీశీలించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన రాకను ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో అవకతకాలు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం, ఇంచార్జ్ ఎమ్మెల్సీ శ్రీభరత్ రెడ్డి, చిత్తూరు కలెక్టర్ శన్ మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి ఉన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నగరి మునిసిపల్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Scroll to Top