బీఆర్ఎస్ లో భారి చేరికలు: కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 25: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమైందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో జాజిరెడ్డి గూడెం మండలం పర్సాయిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులూ, కార్యకర్తలు మోత్కూర్ మండలం ముషిపట్ల గ్రామానికి చెందినా కాంగ్రెస్ పార్టీ నాయకులూ దాదాపుగా 150 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేయంగా ముందుకు పోతున్న టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మరింత అభివృద్ధి జరుగుతుందని ధీమానిచ్చారు. పార్టీలో చేరిన వారు వార్డు సభ్యులు బానోతు సైదులు, నాయకులు కీర్తి చిట్టి బాబు, జాని, మైభు, హుస్సేన్, హెక్బల్, వెంకట్ రెడ్డి, ముత్తయ్య, జోగయ్య, నర్సింహా, వీరయ్య, ప్రవీణ్, మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుషిపాక నాగరాజు, ప్రదీప్, దిలీప్, మహేష్, సతీష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top