గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

చిట్యాల, ప్రజానేత్రం ఆగష్టు 13: మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామనికి చెందిన రూపని ముత్తమ్మ (70), అదే గ్రామానికి చెందిన మందుగుల చిన్నరాజయ్య (63) ఇటివల వివిధ కారణాలతో వేరువేరుగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల రూపాయలు పంపించారు. ఆదివారం ఉరుమడ్ల మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి ఆధ్వర్యంలో మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మర్రి అబ్బయ్య, నడింపల్లి గోపాల్, తెలంగాణ ఉద్యమకారుడు జన్నపల శ్రీను, ట్రస్టు సభ్యులు మర్రి రమేష్, అశోక్, సుమన్ ఉయ్యాల నరేష్, వేముల లింగయ్య, పాకాల బాలరాజ్, అనంతల శంకరయ్య, మధగొని శ్రీకాంత్, సుగురు శ్రవణ్ కుమార్,ఐత రాజు శేషయ్య, వరుకుప్పల వెంకటయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top