లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుత్తా అమిత్ రెడ్డి

యాదాద్రి, ప్రజానేత్రం, ఆగష్టు 12: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కొమురవెల్లి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గుత్త వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శనివారం రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక పరిస్థితుల రీత్యా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని పిల్లల చదువుల కొరకై తమ వంతు సాయం చేస్తానని హామీనిచ్చారు. ఆర్థిక సహాయం అందజేసిన అమిత్ రెడ్డికి రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top