కేసీఆర్ కు మగ్గాల చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడు తెలుసు: ఎమ్మెల్యే కూసుకుంట్ల..

చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత, జౌలిశాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ స్థాయి చేనేత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చేనేత మిత్ర పథకం, నేతన్న చేయూత చెక్కులను నేతన్నలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరమగ్గల చప్పుడే కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసు అన్నారు, నేతన్నల గుండె చప్పుడు తెలిసినందునే ఉద్యమ కాలంలోనే ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు భూదాన్ పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని గుర్తుచేశారు. చేనేతలకు ఆదరణ, గుర్తింపు లేక పోవడంతో ఆత్మాభిమానంతో అప్పులు చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కలత చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడిగా జోలె పట్టుకుని వసూలు చేసిన మొత్తలతో చేనేత కార్మికులకు అండగా నిలిచిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా సమస్యను సత్వరమే అర్థం చేసుకోగలిగిన సీఎం కేసీఆర్ చేనేతలకు అండగా నిలవడంతో చేనేతలు ఇంతటి పురోగతి సాదించారన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలపాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు కెసిఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని, బడ్జెట్‌లోనూ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించి నేతన్నల సంక్షేమానికి పాటుపడుతున్నదని, వృత్తిపై ఆధారపడ్డ నేతన్నలను గుర్తించి మగ్గాలను జియో ట్యాగింగ్‌ చేసిందని, రైతులకు మాదిరిగా బీమా పథకంతోపాటు నేతన్నకు చేయూత, త్రిఫ్ట్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నదని. చేనేత వస్ర్తాలకు విశేష ఆదరణ కలిగించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా చేనేత వస్ర్తాలు ధరించాలన్న సూచనలతో కార్మికులకు ఉపాధి సైతం పెరుగుతుండడంతో చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా సీఎం కేసీఆర్ చేనేత సంబురాల నిర్వహణకు పిలుపునిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు,జడ్పిటిసిలు చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top