బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి

నల్గొండ, ప్రజానేత్రం, జూలై 30: మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజానేత్రంతో మాట్లాడారు ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొట్ట మొదటి స్థానంగా తెలంగాణ నిలిచిందన్నారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని ధీమానిచ్చారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ సత్త చాటుతుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు బీఆర్ఎస్ కే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to Top