ఆర్ట్స్ కాలేజ్.. టు అసెంబ్లీ..

నల్గొండ, ప్రజానేత్రం, ఆగస్టు 11:

ఉద్యమ సమయంలోనే కేసీఆర్ మనసులో గాదరి కిషోర్ కుమార్ కు జరగని ముద్ర, చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి నూతన రాష్ట్ర శాసనసభల్లో అవకాశం, ఆయన జీవితాన్ని చరిత్రలు రాసే విధంగా అవకాశం కల్పించిన కేసీఆర్, ప్రజల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నైజాం ఎమ్మెల్యే గాదరిది, వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించిన ఘనత ఎమ్మెల్యే గాదరికే దక్కింది, పల్లెనిద్రతో ప్రజల్లో కలిసిపోయిన చరిత్ర ఆయనది…

తెలంగాణ రాష్ట్ర సాధనకై కెసిఆర్ కంకణ బద్ధులై ఉద్యమం చేస్తున్న సమయంలో విద్యార్థి దశ నుండి యూనివర్సిటీలో ఉద్యమాన్ని లేవనెత్తి ఉదృతం చేస్తూ కేసీఆర్ కు అండదండగా నిలిచి ఎన్నో ఉద్యమాలు చేసి కేసీఆర్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ కిషోర్ కుమార్. ఉద్యమ సమయంలో కెసిఆర్ మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2014 ఎన్నికల చివరి నిమిషంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని విజయ డంక మోగించారు. పల్లెనిద్రతో ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడడమే ఆయన నైజం కావడంతో నియోజకవర్గ ప్రజల్లో వికాస్ అయిన ఎమ్మెల్యేగా పేరుపొందారు. అసంపూర్తిగా ఉన్న ఎస్సారెస్పీ కాలువను పట్టు విడుదల విక్రమార్కంలో నడుం బిగించి ప్రభుత్వాన్ని ఒప్పించి అధిక నిధులు కేటాయింపు తో కాల్వ పూర్తి చేసి నియోజకవర్గానికి నీరు అందించి ప్రజలకు దేవుడయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించి, ప్రజా సంక్షేమంలో అనేక మంచి పనులు చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ఆయన జీవితాన్ని చరిత్రలు రాసే విధంగా అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలై ఉన్నారు. అభివృద్ధి ఆయన లక్ష్యం, మాట తప్పని, మడమ తిప్పని నేత, ప్రజలకు సేవ చేసి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే ఆయన నైజంగా పేరు ఉందిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు ఈ ఎన్నికల్లో తిరుగు లేకుండా అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు ధీమానిస్తున్నారు. ప్రజలు ఈ సారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమేనంటున్నారు.

Scroll to Top