నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు

చౌటుప్పల, ప్రజానేత్రం, ఆగష్టు 15: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “ఇంటింటా ఇన్నోవేటర్” పోటీలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన తోటకూర ప్రవీణ్ రూపొందించిన మ్యాజిక్ స్ప్రేయర్ ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ ఒక్క పరికరం మాత్రమే ఎంపిక కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సూచనతో జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర ఉత్సవంలో ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రవీణ్ ను అభినందించారు.

Scroll to Top