మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: సుర్వి యాదయ్య గౌడ్

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 15: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం గాంధీ భవన్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత బీసీ బిడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పోలీస్ అధికారులను నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు భేశరత్ గా క్షమాపణలు చెప్పాలనీ గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డు లో గౌడ్ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు పూటకో పార్టీ మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఐక్యంగా ఉద్యమించితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లే ఇచ్చి యూటర్న్ తీసుకోవడం వల్ల 1200 మంది తెలంగాణ యువకుల ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ లోని సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన బీసీ బిడ్డ శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ అధికారులను రేవంత్ రెడ్డి తీవ్రమైన అసభ్య పదజాలంతో తిట్టిన మాటలను భేశరత్ గా వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనట్లయితే రేవంత్ రెడ్డి పర్యటనలను రాష్త్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీ ఓడించి రేవంత్ రెడ్డి తలకెక్కిన అహంకారాన్ని దించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు సుర్వి లింగస్వామిగౌడ్ గౌడ, సంఘం నాయకుడు పెరపల్లి స్వామిగౌడ్, కాటపెళ్లి శేఖర్ గౌడ్, సుర్వి లింగస్వామి, సిద్ధవోని శ్రీనివాస్ గౌడ్, గుండు లింగన్న గౌడ్, కోడూరు లింగస్వామి, సుర్వి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top