శ్రీశైలంలో ఎలుగుబంటి

శ్రీశైలం, ప్రజానేత్రం, ఆగష్టు 14: ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల దర్శనాలకు వస్తున్న ప్రజలను వన్య మృగాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో పులి చిన్నారుని ఎత్తుకెళ్లిన విషయం మరవక ముందే శ్రీశైలంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న విషయం భక్తులను అయోమయం చేస్తుంది. ఆదివారం రాత్రి శ్రీశైలం దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులకు మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనిపించటంతో భక్తులు ఫోన్లలో వీడియోలు కూడా తీశారు. భయ భ్రాంతులకు గురి అవుతున్న భక్తులకు భద్రత కట్టుదిట్టం చేయాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Scroll to Top