ఉరుసు ఉత్సవాల ఎడ్ల పండ్లను ప్రారంభించిన: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన హజరత్‌ అబూబకర్‌ ఉరఫ్‌ బడేమియా స్వామి (తుర్లపాడు) ఉరుసు (ఉత్సవం) బుధవారం కన్నుల పండవగా ప్రారంభమైంది. రాజకీయాలతో సంబంధం లేకుండా పిల్లలు, వృద్ధులను వెంటబెట్టుకుని ముస్లింలు దర్గాకు తరలివెళ్లటంతో పెండ్యాలలో, తుర్లపాడులో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ ఉత్సవంలో కుల, మత, ధనిక, పేద అనే తేడాలు కనిపించవు. వందల ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉరుసు అందరూ సమానమేనన్న గొప్ప భావన ప్రతి ఒక్కరిలోకలుగచేస్తున్నది.


వ్యవసాయపనులు ముగిసిన తర్వాత మామిడికాయల సీజన్‌ ప్రారంభంలో ముస్లింలు బడేమియా స్వామి ఉరుసును ఘనంగా జరుపుకొంటారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పెండ్యాల ముస్లింలు శనివారం సాయంత్రానికే స్వగ్రామం చేరుకున్నారు. ఆదివారం కోలాహలంగా మొదలైన ఈ ఉత్సవాన్ని నందిగామ మాజీ  ఎమ్మెల్యే ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్జిగ, తాగునీరు అందించారు. కొంత మంది ఎడ్ల బండ్లపై మునేటి మీదుగా చందర్లపాడు మండలం తుర్లపాడు చేరుకోగా, పలువురు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తుర్లపాడు తరలివెళ్లారు. దర్గా వద్ద ఖాళీగా ఉన్న పంట భూముల్లో పట్టాలతో ప్రత్యేకంగా డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే రాత్రి జాగారం చేయడం సంతోషకరమన్నారు. గోధుమ పిండి, పంచదార, నెయ్యితో మిఠాయి, బిర్యానీ, పలావు తయారుచేసి, బడేమియా దర్గాలో నమాజు, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ మరుసటి ఉదయం ఎద్దుల బండ్ల వెంట వచ్చిన హిందువులతో కలిసి భోజనాలు చేసి పెండ్యాల తిరిగి రావటంతో రెండు రోజుల ఉత్సవం ముగియనుంది.

Scroll to Top