ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం వైపు ఉన్నారు: ఎమ్మెల్సీ అరుణ్

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 15: ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ వైపు, సామాన్యులు, అభివృద్ధి కాంక్షించే వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి… సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నేతలతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకర్ రావుతో కలిసి ప్రయాణం చేసిన వారు నేడు తంగిరాల సౌమ్యతో ఎందుకు కలసి లేరన్నారు. ఆనాడు సీనియర్ నాయకులను దూరం చేసుకొని… తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది… మళ్లీ తంగిరాల సౌమ్యకు ఓటమి తప్పదు… ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాయకులు తమ వంతు కృషి చేస్తారని ధీమానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top