జగనన్న పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: శైలజ చరణ్ రెడ్డి

చిత్తూరు, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి దాష్టకం దీనిని ఖండిస్తున్నామని పూతలపట్టు నియోజకవర్గం అదనపు పరిశీలకురాలు మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆమే మీడియాతో మాట్లాడుతూ ఇది కచ్చితంగా కూటమి రాజకీయ కక్ష మాత్రమే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే జరిగిన రాజకీయ పైశాచిక ఆనందం, జగనన్న ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి వైసిపిని బెదిరించడానికి కూటమి ఆడుతున్న దిగజారుడు రాజకీయాలు, ప్రజలను జగన్మోహన్ రెడ్డిని విడదీయడానికి ఈ కూటమి ఆడుతున్న ఆట అన్నారు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. కాబట్టి పెత్తందారులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల కూటమి జగన్మోహన్ రెడ్డి పైన ఇలాంటి దాస్టిక చర్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమని ఈ యుద్ధంలో చివరికి పేదలు మాత్రమే విజయం పొందుతారని పేదల తరఫున పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి విజయం వరిస్తుందని తెలిపారు. ఇలాంటి రాక్షస కూటమికి పట్టం కడితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది రాష్ట్ర ప్రజలను ఈ పెత్తందారుల కూటమి చెప్పు కింద నలిపినట్టుగా నలుపుతారని సామాజిక సమానత్వంనకు పాటుపడిన జగన్మోహన్ రెడ్డి ఆశయాలు తుంగలోకి తోస్తారని ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుంటారన్నారు. ఏది ఏమైనా జగనన్న ప్రజలను ఏ దుష్టశక్తి కూడా దూరం చేయలేదని జగనన్నకి దేవుడు ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని రాబోయే రోజుల్లో ప్రజలందరూ జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ పెత్తందారుల కూటమిని తుంగలో తొక్కుతారని ప్రజలు చాలా తెలివైన వారన్నారు. ఒక సీఎంకే ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు అంటే సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అని ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని ప్రోత్సహించిన వారిని కూడా అరెస్టు చేయాలని ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన, న్యాయ స్థానాలపైన ఉందని, ఏది ఏమైనాప్పటికీ ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

Scroll to Top