కొనసాగుతున్న వసంత థీమంత్ సాయి ఇంటింటి ప్రచారం

ఇబ్రహీంపట్నం, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ తనయుడు వసంత థీమంత్ సాయి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయనకు కూటమి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన గ్రామంలో వసంత కృష్ణప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఓటర్లతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారని, అలాగే విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేశినేని శివనాథ్ (చిన్ని) పోటీ చేస్తున్నారని, రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి ఇద్దరినీ గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top