రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించనున్న ఎన్డీయే కూటమి : తంగిరాల సౌమ్య

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14:

సైకిల్‌ గుర్తుకు ఓటువేసి కూటమికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని 6వ వార్డులో ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోతోనే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని సౌమ్య వివరించారు.

ప్రజల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిందని, వైసీపీ చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఓట్లు దండుకునేందుకు మాయమాటలు చెబుతూ ప్రజల మధ్య వస్తున్న వారికి ఓటు తో బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరూ కూటమికి ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ది జరగాలంటే అది ఒక్క కూటమితోనే సాధ్యమన్నారు. ఎన్డీయే గెలిస్తే రాష్ట్రం, నియోజకవర్గం ప్రగతి మార్గంలో నడుస్తుందని, కంపెనీలు వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

Scroll to Top