అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

మునుగోడు, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు మునుగోడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత రాజ్యాంగాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదరి శరణార్థి,గొలి మారయ్య, ముచ్చపోతుల నర్సింహ, దాసరి సాయికుమార్, ముచ్చపొతుల శ్రీకాంత్ ,సిరిగమల రమేష్, పెరుమాల్ల నరసింహ,బెల్లపు బాలశివ రాజు, పెరుమల్ల శ్రీను,కట్ట నర్సింహ, ముచ్చపోతుల బాలరాజు, పెరుమాల్ల రామలింగయ్య, రెడ్డిమళ్ళ యాదగిరి,బోల్లు సైదులు,నడిపల్లి శ్రీనివాస్,గోలి రామదాసు, పెరుమాల్ల రాజీవ్, గాధరి రామలక్ష్మయ్య,దాసరి సాయిచంద్,గంగుల క్రిష్ణయ్య,చింతపల్లి శివ, ఈద పవన్,గోలి రాములు,ఈద లింగ స్వామి,ఈద శ్రీకాంత్,సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top