బోడుప్పల్ 7వ డివిజన్లో “హరితహారం మొక్కలు” నరికివేత

మేడిపల్లి,ప్రజానేత్రం, ఆగష్టు 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్లో అందుకు భిన్నంగా హరితహారం నాటిన చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని,పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒకవైపు ప్రజలకు చెప్తూ మరోవైపు హరితహారం చెట్లు నరకడం వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని,ప్రజా ప్రతినిధులను మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి

విద్యుత్ వైర్లకు అడ్డు వస్తే కొమ్మలు మాత్రమే నరుకుతారని ఇక్కడ మాత్రం మంచిగా ఎదిగిన చెట్లను నరకడం బాధాకరమని దీనికి కారకులైన బాధ్యులపై కమిషనర్ చర్యలు తీసుకుని మళ్లీ మొక్కలు నాటే విధంగా చూడాలని,లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హరినాథ్ రెడ్డి అన్నారు.

Scroll to Top