కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కల్వకుంట్ల కవితకు లేదు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 23: రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో 100కు పైగా అభ్యర్థులను ప్రకటిస్తే కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించడం దురదృష్ట కరమని,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి బిఆర్ఎస్ పార్టీ పైన, మండిపడ్డారు.అదేవిధంగా మహిళ రిజర్వేషన్లు పై చిత్తశుద్ధి ఉంటే కేవలం ఏడుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చారు దానిపై పోరాటం చేద్దాం అని కవితకు సవాల్ విసిరారు.అంతే కాకుండా జంతర్ మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం కాదు మీ అయ్య చేతిలో అవకాశాలు ఉన్న టికెట్స్ ఇవ్వలేదు కదా ప్రగతి భవన్ వద్ద ధర్నా చేద్దాం అని, వస్తావా అని కవితని ప్రశ్నించింది. మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు, మహిళలకు ఏఐసీసీ అధ్యక్ష పదవి, ప్రధాన మంత్రి పదవి, లోక్ సభ లో స్పీకర్ పదవీ, రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత అని మహిళ రిజర్వేషన్లను రాజ్యసభ లో ఆమోదించిన చరిత్ర,ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని కల్వకుంట్ల కవిత పై మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు నువ్ జంతర్ మంతర్ వద్ద బూటకపు ధర్నా చేసావు, ఎంపీ గా ఉన్న నువ్వు ఏనాడైనా మహిళ రిజర్వేషన్లు గురించి మాట్లాడిన దాఖలాలు లేవని,మోడీ తో అంటకాగిన మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారా? కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, కల్వకుంట్ల కవితకు వరలక్ష్మి హితవు పలికారు.

Scroll to Top