మేడి ప్రియదర్శిని హౌస్ అరెస్టు

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 20: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ బిఎస్పి ఇంచార్జి మేడి ప్రియదర్శిని ని ఆదివారం పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు సీఎం కెసిఆర్ హాజరైతున్న నేపథ్యంలో బిఎస్పి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ ఈ అప్రజాస్వామిక చర్యలను ఆమె ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదన్నారు. కెసిఆర్ కు ఓటమి ఖాయం అని అన్నారు.

Scroll to Top