నకిరేకల్, ప్రజానేత్రం, ఆగష్టు 18: దోపిడిదారులను అంతమొందించి దొరల పెత్తందారుల ఆధిపత్యాలకు చరమగీతం పాడిన మహాత్ముడు సర్వాయి పాపన్న గౌడ్ అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కొనియాడారు. శుక్రవారం బిఎస్పి ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల అభ్యున్నతి కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప ధీరుడు బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. అన్ని కులాల వారిని కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. సర్వాయి పాపన్న ఇచ్చిన దైర్యం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. బిఎస్పి పార్టీ అన్ని వర్గాలను కలుపుకును ముందుకువెళ్తుందని. అందరికి ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ బందు వాళ్ల కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. ఇతర పార్టీల వాళ్ళు బీసీలు కాదా అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది ఓటు బ్యాంక్ రాజకీయాలు అని ఎద్దేవా చేశారు. ఎంత మందికి బీసీ బంధు ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. బీసీ మిత్రులారా ఇప్పటికైనా తెలుసుకోండి బీసీల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని అన్నారు జనాభా ప్రాతపదికన సీట్లు కేటాయించే ఏకైక పార్టీ బిఎస్పి అని అన్నారు. ఇప్పటికైనా మనం బిఎస్ పార్టీలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, కట్టాంగూర్ మండల అధ్యక్షులు మేడి శ్రీను, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, నార్కట్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, దొరపల్లి ప్రశాంత్, చెడిపల్లి అనిల్, నక్కల పవన్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.