కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగస్టు 18: నియోజకవర్గంలో గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాముల చేతుల్లో, గడీలలో మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు స్యేచ్ఛను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మహా వ్యక్తి సర్వాయి పాపన్న గౌడని అటువంటి గొప్ప నాయకుడిని ఆయన 373వ జయంతి నాడు గుర్తిస్తూ నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం ఆనందదాయకమన్నారు. సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటి నాయకులు, సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.