రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న: ఎమ్మెల్యే కెపి

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగష్టు 20: నియోజకవర్గంలో 128 చింతల్ డివిజన్ పరిధిలోని ధోబీఘాట్ భగత్సింగ్ నగర్లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆదివారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్తి అధ్యక్షులు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బాలయ్య, వీరయ్య, పురుషోత్తం, శ్రీనివాస్, యాదగిరి, నర్సయ్య, లావణ్య, సీనియర్ నాయకులూ అశోక్, సింగారం మల్లేష్, బీసు వెంకటేశం గౌడ్, సామ్రాట్, శ్రీశైలం యాదవ్, బస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top