కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన…

ప్రజానేత్రం, వెబ్ డెస్క్, ఆగష్టు 21: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొలి జాబితా సీట్ల విడుదలపై క్లారిటీ వచ్చింది. నేడు (సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తొలి జాబితా అభ్యర్థుల లిస్టును అధికారికంగా అప్పుడే మీడియా ముందు ఉంచనున్నారు. ఉదయం నుంచి ఫస్ట్ లిస్టు కోసం అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టికెట్ దక్కిన బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వారి అనుచరులు ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో బాణసంచా, బ్యాండ్, డీజెలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రుల ద్వారా టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలుకు సిద్ధం చేసుకుంటున్నారు.

Scroll to Top