Author name: prajanetram.com

రెవెన్యూ డివిజన్ కొరకు రాస్తారోకో…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం అధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపెది లేదని అధికార ప్రజా ప్రతినిధులు తక్షణమే చిత్తశుద్ధి ఉంటే నాంపల్లి మండలం మీద రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల బస్టాండ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. …

రెవెన్యూ డివిజన్ కొరకు రాస్తారోకో… Read More »

ప్రజా సేవకై ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే కెపి

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద ను తన నివాసంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో చారువాణిలో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

మునుగోడును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి: మునుగోడు అఖిల పక్షం డిమాండ్

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 07: నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుని రెవెన్యూ డివిజన్ గా, మున్సిపాలిటీగా ప్రకటించి 200 కోట్లతో అభివృద్ధి చేయాలని గురువారం మునుగోడు మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుని మున్సిపాలిటీగా చేసి 200 కోట్లతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఒక జూనియర్ కాలేజ్ ఒక టెక్నికల్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు, అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఇచ్చిన …

మునుగోడును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి: మునుగోడు అఖిల పక్షం డిమాండ్ Read More »

అంతర్ జిల్లా నియోజకవర్గ స్థాయి పోలీసుల సమావేశం

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 07: మండల పరిధిలోని వివేరా హోటల్లో అంతర్ జిల్లా నియోజక వర్గ స్థాయి పోలీస్ నోడల్ ఆఫీసర్ ల అధ్యక్షతన అన్ని బోర్డర్ పోలీస్ స్టేషన్ ల సంబంధిత పోలీస్ అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కు సంబంధించిన నియోజకవర్గాలకు, నియోజకవర్గాలకు మధ్య బోర్డర్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేయాలని, వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయాలని ఎలక్షన్ రోజుకు 48 గంటల ముందు నియోజక …

అంతర్ జిల్లా నియోజకవర్గ స్థాయి పోలీసుల సమావేశం Read More »

ఇనిస్టా ఫోటోలతో బ్లాక్ మెయిల్ అన్నయ్యతో చెల్లెలు శివాని చివరి మాటలు: సంచలనంగా మారిన ఆడియో

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: నల్గొండలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా, టీవీ, సెల్ ఫోన్ల ప్రభావం వలన యువతీ యువకులు పక్కదారి పడుతున్నారని అదుపులేని Instagram, Whatsapp లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని, విద్యార్థినిల వాయిస్ రికార్డు బయటకు వచ్చిందని దాని ప్రకారంగా Instagram లో వారి డీపీలను మార్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇద్దరు …

ఇనిస్టా ఫోటోలతో బ్లాక్ మెయిల్ అన్నయ్యతో చెల్లెలు శివాని చివరి మాటలు: సంచలనంగా మారిన ఆడియో Read More »

చిట్యాల, నకిరేకల్ మండలాల బీఎస్పీ మహిళా కన్వీనర్లు ఎన్నిక

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: చిట్యాల మండల బిఎస్పి పార్టీ మహిళా కన్వీనర్ గా చిట్యాల మున్సిపాలిటీ చెందిన పాల భవాని ని, నకిరేకల్ మహిళ కన్వీనర్ మర్రి శోభ ఏక గ్రీవంగా నియమితులయ్యారు. వారికి బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాల భవాని మాట్లాడుతూ చిట్యాల మండలంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికోసం కష్టపడి పని చేస్తానని ఆమె అన్నారు. మహిళలను గుర్తింపు …

చిట్యాల, నకిరేకల్ మండలాల బీఎస్పీ మహిళా కన్వీనర్లు ఎన్నిక Read More »

మునుగోడును మున్సిపాలిటీతో పాటు, రెవిన్యూ డివిజన్ చెయ్యాలి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: నియోజకవర్గ కేంద్రం అయినా మునుగోడు మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి అభివృద్ధికి దూరం పెడుతుండడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆరోపించారు. బుధవారం అయన జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుకి 200 కోట్లతో అభివృద్ధి చేయాలన్నారు. మునుగోడు పట్టణానికి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, టెక్నికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. …

మునుగోడును మున్సిపాలిటీతో పాటు, రెవిన్యూ డివిజన్ చెయ్యాలి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు… Read More »

యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: దూదిమెట్ల బాలరాజ్ యాదవ్…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: యాదవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి వారికి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు .మంగళవారం మండలంలోని లింగోటం, కేతపల్లి, బండ తిమ్మాపురం, ముష్టి పెళ్లి, సుంకిశాల గ్రామాలలో రెండో విడత గొర్రెల పంపిణీ నీ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ …

యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: దూదిమెట్ల బాలరాజ్ యాదవ్… Read More »

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: మండలంలోని సోమవారం మల్లపురాజు పల్లి గ్రామానికి చెందిన కడారి రమేష్ (35) అన్మాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో ఆవులను మేపడానికి పొలం దగ్గరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి పొలం దగ్గరికి వెళ్లి వెతకగా అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి సీఐ నవీన్ …

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి… Read More »

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: చలమల్ల కృష్ణ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: రానున్న ఎన్నికల్లో మునుగోడు గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇంచార్జ్ చలమల్ల కృష్ణా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధ్యక్షుడు సూరిగి నర్సింహ అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ …

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: చలమల్ల కృష్ణ రెడ్డి… Read More »

Scroll to Top