ఇనిస్టా ఫోటోలతో బ్లాక్ మెయిల్ అన్నయ్యతో చెల్లెలు శివాని చివరి మాటలు: సంచలనంగా మారిన ఆడియో

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: నల్గొండలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా, టీవీ, సెల్ ఫోన్ల ప్రభావం వలన యువతీ యువకులు పక్కదారి పడుతున్నారని అదుపులేని Instagram, Whatsapp లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని, విద్యార్థినిల వాయిస్ రికార్డు బయటకు వచ్చిందని దాని ప్రకారంగా Instagram లో వారి డీపీలను మార్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి తదుపరి వాళ్ళ అన్నయ్య తో మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరపాలని వారి కాల్ డేటా ఆధారంగా దోషులు ఎవరైనా ఉంటే దొరకబట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నయ్యతో శివాని మాట్లాడిన చివరి మాటలు విని పలువురు కంటతడి పెట్టుకున్నారు.

Scroll to Top