అంతర్ జిల్లా నియోజకవర్గ స్థాయి పోలీసుల సమావేశం

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 07: మండల పరిధిలోని వివేరా హోటల్లో అంతర్ జిల్లా నియోజక వర్గ స్థాయి పోలీస్ నోడల్ ఆఫీసర్ ల అధ్యక్షతన అన్ని బోర్డర్ పోలీస్ స్టేషన్ ల సంబంధిత పోలీస్ అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కు సంబంధించిన నియోజకవర్గాలకు, నియోజకవర్గాలకు మధ్య బోర్డర్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేయాలని, వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయాలని ఎలక్షన్ రోజుకు 48 గంటల ముందు నియోజక వర్గాల లో గల బయట వ్యక్తుల సమాచారాన్ని గురించి బోర్డర్ లలో వున్న అందరూ పోలీస్ అధికారులు ఎలక్షన్స్ నోడల్ ఆఫీసర్ ల సహాయంతో తెలియజేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారులు నల్గొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసిపి మోగులయ్య, సూర్యాపేట డి ఎఎస్పీ నాగ భూషణం, వీరితో పాటు శాలి గౌరారం సర్కిల్ సీఐ రాఘవరావు, నార్కట్ పల్లి సీఐ మహేష్, చండూర్ సీఐ వెంకట్, నాగారం సీఐ శివ శంకర్, చౌట్టుప్పల్ సీఐ దేవేందర్, నార్కట్ పల్లి, చిట్యాల, మునుగోడు చండూరు, శాలిగౌరారం, కేతేపల్లి, సూర్యాపేట రూరల్, తిరుమలగిరి, నాగారం, తుంగతుర్తి, అర్వపల్లి, మోత్కూరు, నారాయణపురం, రామన్నపేట, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top