మునుగోడును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి: మునుగోడు అఖిల పక్షం డిమాండ్

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 07: నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుని రెవెన్యూ డివిజన్ గా, మున్సిపాలిటీగా ప్రకటించి 200 కోట్లతో అభివృద్ధి చేయాలని గురువారం మునుగోడు మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుని మున్సిపాలిటీగా చేసి 200 కోట్లతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఒక జూనియర్ కాలేజ్ ఒక టెక్నికల్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు, అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి మండలంలోని అర్హులైన ప్రతి ఒక్క దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బందు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న గొల్ల కురుమల గొర్రెలను వెంటనే ఇవ్వాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో అధికార పార్టీ నేతల ఇళ్ల ముట్టడికి కూడా వెనకాడబోమని తెలియజేశారు. అవసరమైతే భవిష్యత్తులో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి కూడా సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధగోని నరేందర్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు కురుమ, బీఎస్పీ నియోజకవర్గ నాయకులు పందుల సురేష్ మాదిగ, బిసి యూవజన సంఘం జిల్లా అధ్యక్షులు నేరటి మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గ నాయకులు సునీల్ సులేమాన్, వెంకటేష్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top